ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఅమ్మపల్లి ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుందాం

అమ్మపల్లి ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుందాం

📰 Generate e-Paper Clip

నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

మహిళా సమైక్య భవనానికి భూమిపూజ

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన పాలన, ప్రజా సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో నూతన భవనం కీలకంగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. మహిళా సంఘాల బలోపేతం, స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు ఇటువంటి భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాధవి వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు క్యామ నవనీత రాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, పెద్దమందడి మండలాధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ. సత్యరెడ్డి, గట్టు యాదవ్, శ్రీనివాసులు, బాలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, గ్రామ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!