ePaper
Tuesday, November 17, 2026
📄 ePaper

అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు.. టౌన్ ప్లానింగ్ అధికారిణి నివాసంలో మెరుపు సోదాలు!

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా (పొలిటికల్ పవర్ న్యూస్):

అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు పాల్పడుతున్న అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) వాణి నివాసంలో ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే మెరుపు సోదాలు నిర్వహించారు.

రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్‌లో ఉన్న ఆమె నివాసంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టిన అధికారులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత..

సదరు అధికారిణి వాణిపై అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా రెండు నెలల క్రితమే ఓ పని నిమిత్తం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నాటి కేసు విచారణలో భాగంగా ఆమె అక్రమ సంపాదనపై అధికారులకు కీలక ఆధారాలు లభించడంతో, తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమార్జన చిట్టాపై ఏసీబీ ఆరా..

ప్రస్తుతం కొనసాగుతున్న సోదాల్లో భాగంగా వాణి, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిరాస్తులు, ఖరీదైన ప్లాట్లు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు మరియు ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.

ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే లంచాలకు మరిగి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత ఆమె అక్రమార్జన విలువ ఎంతనేది ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.

(వార్త సేకరణ: యర్ర నాగరాజు రెడ్డి – పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్)

 

Latest Articles

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్…

 నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి. 16...

శ్రీశైల మల్లన్న అన్నప్రసాద వితరణకు రూ. 3.60 లక్షల విలువైన పచ్చళ్ల విరాళం.. దాతల ఔదార్యంపై ప్రశంసలు

నంద్యాల జిల్లా, శ్రీశైలం (నవంబర్ 16):ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ...

దేవనకొండ పంచాయతీ రాజకీయాల్లో కీలక పరిణామం: స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నేత నామినేషన్

కర్నూలు జిల్లా, దేవనకొండ :పి దస్తగిరికర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలోని...

మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ప్రజాప్రతినిధి.. వికలాంగుడు ఇంటికెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జారె

అన్నివేళలా అండగా ఉంటానంటూ బాధిత కుటుంబానికి భరోసాపొలిటికల్ పవర్, అన్నపురెడ్డిపల్లి, నవంబర్16:ప్రజాప్రతినిధి...

Related Articles

దేవనకొండ పంచాయతీ రాజకీయాల్లో కీలక పరిణామం: స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నేత నామినేషన్

కర్నూలు జిల్లా, దేవనకొండ :పి దస్తగిరికర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు ఒకరు...

ఎన్నిక‌ల ప్ర‌క్రియను అప‌హాస్యం చేశారు – పోలీసు వ్య‌వ‌స్థ‌ను అడ్డం పెట్టుకుని అరాచ‌కాలు – అధికార కూట‌మి ఆగ‌డాలకు హ‌ద్దులేకుండా పోయింది : వైఎస్సార్‌సీపీ నాయ‌కుల ధ్వ‌జం 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*పంచాయ‌తీలు, మున్సిపాలిటీల‌కు నామినేష‌న్ల సంద‌ర్భంగా అధికార కూట‌మి...

– ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు వ‌సూలు చేసిన ప‌వ‌న్ స‌న్నిహితురాలు – స్కామ్ బ‌య‌ట‌ప‌డ‌డంతో సాధారణ ఉద్యోగిని ఇరికించిన కోట రుక్మిణీ అండ్ గ్యాంగ్

 ‌*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్రెండ్ క‌మ్ పీఏ...
error: Content is protected !!