ePaper
Tuesday, November 17, 2026
📄 ePaper

మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ప్రజాప్రతినిధి.. వికలాంగుడు ఇంటికెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జారె

📰 Generate e-Paper Clip

అన్నివేళలా అండగా ఉంటానంటూ బాధిత కుటుంబానికి భరోసా

పొలిటికల్ పవర్, అన్నపురెడ్డిపల్లి, నవంబర్16:ప్రజాప్రతినిధి అంటే కేవలం అధికారాలకే పరిమితం కాకుండా.. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనం. ఈ మాటలకు నిలువెత్తు ఉదాహరణగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నిలిచారు.

పక్షవాతం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న ధారావత్ వెంకటేశ్వర్లు పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితితో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక చొరవ తీసుకొని ఆయనకు వికలాంగుల చేయూత పింఛన్ మంజూరు చేయించారు.

అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. ఎలాంటి ఆందోళన చెందవద్దని, మీ కుటుంబానికి అండగా ఉంటానని, భవిష్యత్తులో ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని భరోసా ఇచ్చారు.

సాధారణంగా సమస్యలు తమ దృష్టికి వచ్చినప్పుడు స్పందించే ప్రజాప్రతినిధుల మధ్య.. బాధితుడి ఇంటి వద్దకే వెళ్లి పరిస్థితిని తెలుసుకొని, ప్రభుత్వ సంక్షేమ పథకం అందేలా చొరవ చూపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కష్టాల్లో ఉన్నవారిని గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావిస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సేవా దృక్పథానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీముడు కట్ట శివ, అన్నపురెడ్డిపల్లి ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్…

 నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి. 16...

అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు.. టౌన్ ప్లానింగ్ అధికారిణి నివాసంలో మెరుపు సోదాలు!

హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా (పొలిటికల్ పవర్ న్యూస్):అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు...

శ్రీశైల మల్లన్న అన్నప్రసాద వితరణకు రూ. 3.60 లక్షల విలువైన పచ్చళ్ల విరాళం.. దాతల ఔదార్యంపై ప్రశంసలు

నంద్యాల జిల్లా, శ్రీశైలం (నవంబర్ 16):ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ...

దేవనకొండ పంచాయతీ రాజకీయాల్లో కీలక పరిణామం: స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నేత నామినేషన్

కర్నూలు జిల్లా, దేవనకొండ :పి దస్తగిరికర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలోని...

Related Articles

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్…

 నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి. 16 నవంబర్ 2026. రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో బిజెపి కార్యకర్త జిలకర మహేందర్ తండ్రి జిలకర సాయిలు కొంతకాలంగా అనారోగ్యంతో...

బియ్యం ధరలపై అధికారుల నిఘా.. దుకాణాల్లో ధరల పట్టిక తప్పనిసరి

ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే విక్రయించాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుపొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 16:ప్రజలకు బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా, విక్రయాల్లో పారదర్శకత పాటించేలా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్...

భద్రాచలంలో అక్రమ బహుళ అంతస్తుల భవనాలపై సమగ్ర విచారణ చేపట్టాలి

ప్రభుత్వ భూముల ఆక్రమణలు, భవన నిర్మాణ అనుమతుల వివరాలు బహిర్గతం చేయాలి 1950 నుంచి 2026 వరకు మేజర్ పంచాయతీ రికార్డులు అందించాలి.. డిప్యూటీ తహసీల్దార్‌కు జీఎస్పీ నాయకుల వినతిపొలిటికల్ పవర్, భద్రాచలం, నవంబర్...
error: Content is protected !!