ePaper
Tuesday, November 17, 2026
📄 ePaper

ఎన్నిక‌ల ప్ర‌క్రియను అప‌హాస్యం చేశారు – పోలీసు వ్య‌వ‌స్థ‌ను అడ్డం పెట్టుకుని అరాచ‌కాలు – అధికార కూట‌మి ఆగ‌డాలకు హ‌ద్దులేకుండా పోయింది : వైఎస్సార్‌సీపీ నాయ‌కుల ధ్వ‌జం 

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

పంచాయ‌తీలు, మున్సిపాలిటీల‌కు నామినేష‌న్ల సంద‌ర్భంగా అధికార కూట‌మి పార్టీలు చేస్తున్న అరాచ‌కాలపై ఎస్ఈసీని క‌లిసి ఫిర్యాదు చేసిన అనంత‌రం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నాయ‌కులు

– క‌ళ్ల ముందే హింస జ‌రుగుతున్నా ఎస్ఈసీది ప్రేక్ష‌క‌పాత్ర‌

– అక్ర‌మాలు, దౌర్జ‌న్యాల‌పై త‌క్ష‌ణం పార‌ద‌ర్శ‌క విచార‌ణ చేయాలి

– కారకులైన అధికారుల‌ను సస్పెండ్ చేసి ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాలి

: వైఎస్సార్‌సీపీ నాయ‌కుల డిమాండ్

విజ‌య‌వాడ‌:

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అపహాస్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటి, శ్రీకాళహస్తి, పల్నాడు, పలమనేరు తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, మహిళా అభ్యర్థుల పత్రాలను సైతం చింపేస్తున్నారని ఆరోపించారు. విజ‌య‌వాడ‌లో ఎస్ఈసీని క‌లిసి నామినేష‌న్ల సంద‌ర్భంగా కూట‌మి నాయ‌కుల అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేసిన అనంత‌రం వైఎస్సార్‌సీపీ నాయ‌కులు మీడియాతో మాట్లాడారు. స్వయంగా మంత్రులే దౌర్జన్యాలకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులైన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పందించని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు, నామినేషన్లు అడ్డుకున్న ప్రాంతాల్లో పోలీసు భద్రత కల్పించి అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని, ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి, విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, వైఎస్సార్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మ‌ల‌సాని మ‌నోహ‌ర్ రెడ్డి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్య‌క్షుడు నారాయ‌ణ మూర్తి, పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కొండమడుగుల సుధాకర్ రెడ్డి, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, పార్టీ నాగవంశం విభాగం అధ్యక్షుడు బొడ్డు అప్పలనాయుడు, పార్టీ దివ్యాంగుల విభాగం మాజీ అధ్యక్షుడు కిరణ్ రాజ్, పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ హాసన్ త‌దిత‌రులు ఎస్ఈసీని క‌లిసి ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

 

ఎవ‌రెవ‌రు ఏం మాట్లాడారంటే…

 

కూట‌మి నాయ‌కులు దాడులు చేస్తే, వైఎస్సార్‌సీపీ వారిపై కేసులేంటి?

– మలసాని మనోహర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు

 

మూడు రోజుల నామినేషన్ గడువులో రెండు రోజులు గడిచిపోయినా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వని దుర్మార్గమైన పరిస్థితి నెలకొంది. రాయచోటి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన అనుచరులతో వెళ్లి నామినేషన్ పత్రాలు చింపించడం, మీడియాపై దాడులు చేయించడం, ఫోన్లు లాక్కోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్‌లను ఉపయోగించి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దాడులు చేస్తున్నది అధికార పార్టీ వారైతే, హత్యాయత్నం కేసులు మాత్రం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పెడుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టెంపేడు మండలంలో 17 పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా వేయనివ్వని పరిస్థితి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని నిష్పక్షపాతంగా నామినేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళనలు చేయక తప్పదు.

 

దాడుల‌కు బాధ్యులైన వారిని స‌స్పెండ్ చేయాలి

– కల్పలతా రెడ్డి, ఎమ్మెల్సీ

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. అన్నమయ్య జిల్లా, పలమనేరు, పల్నాడు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో స్వయంగా మంత్రే మహిళల నామినేషన్ పత్రాలను చింపి, వారిని బయటకు పంపించడం దారుణం. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. దాడులకు బాధ్యులైన అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలను తక్షణమే సస్పెండ్ చేయాలి. రాయచోటి, శ్రీకాళహస్తి సహా నామినేషన్లు అడ్డుకున్న అన్ని ప్రాంతాల్లో పోలీసు భద్రత కల్పించి అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసేలా చర్యలు తీసుకోవాలి.

 

మంత్రులే మ‌హిళ‌ల నామినేష‌న్ ప‌త్రాలు చింపేస్తున్నారు

– రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్

 

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నంత దుష్టపాలన దేశంలో మరే రాష్ట్రంలోనూ చూసి ఉండము. మంత్రులే నేరుగా వెళ్లి మహిళల నామినేషన్ పత్రాలు లాక్కోవడం, చింపేయడం, వారిని అవమానించి బయటకు నెట్టడం జరుగుతోంది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఏమిటి? పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించడానికి ఉన్నారా, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఉన్నారా? ప్రతిరోజూ ఫిర్యాదులు చేస్తున్నా ఎన్నికల కమిషన్, పోలీసు వ్యవస్థ ఒక్క చర్య కూడా తీసుకోవడం లేదు. రేపు చివరి రోజు కాబట్టి మా అభ్యర్థులందరికీ పోలీసు భద్రత కల్పించి నామినేషన్లు వేయించాలి, లేదంటే 2029 ఎన్నికల్లో ఇంకెంత దారుణమైన పరిస్థితులు సృష్టిస్తారో ప్రజలే ఆలోచించాలి.

Latest Articles

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్…

 నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి. 16...

అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ రైళ్లు.. టౌన్ ప్లానింగ్ అధికారిణి నివాసంలో మెరుపు సోదాలు!

హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా (పొలిటికల్ పవర్ న్యూస్):అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమార్జనకు...

శ్రీశైల మల్లన్న అన్నప్రసాద వితరణకు రూ. 3.60 లక్షల విలువైన పచ్చళ్ల విరాళం.. దాతల ఔదార్యంపై ప్రశంసలు

నంద్యాల జిల్లా, శ్రీశైలం (నవంబర్ 16):ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ...

దేవనకొండ పంచాయతీ రాజకీయాల్లో కీలక పరిణామం: స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నేత నామినేషన్

కర్నూలు జిల్లా, దేవనకొండ :పి దస్తగిరికర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలోని...

మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన ప్రజాప్రతినిధి.. వికలాంగుడు ఇంటికెళ్లి పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే జారె

అన్నివేళలా అండగా ఉంటానంటూ బాధిత కుటుంబానికి భరోసాపొలిటికల్ పవర్, అన్నపురెడ్డిపల్లి, నవంబర్16:ప్రజాప్రతినిధి...

Related Articles

శ్రీశైల మల్లన్న అన్నప్రసాద వితరణకు రూ. 3.60 లక్షల విలువైన పచ్చళ్ల విరాళం.. దాతల ఔదార్యంపై ప్రశంసలు

నంద్యాల జిల్లా, శ్రీశైలం (నవంబర్ 16):ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో నిత్యం జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి దాతలు తమ ఉదారతను చాటుకున్నారు. కర్నూలుకు చెందిన...

దేవనకొండ పంచాయతీ రాజకీయాల్లో కీలక పరిణామం: స్వతంత్ర అభ్యర్థిగా వైసీపీ నేత నామినేషన్

కర్నూలు జిల్లా, దేవనకొండ :పి దస్తగిరికర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలోని మేజర్ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు ఒకరు...

– ఉద్యోగాల పేరుతో రూ.కోట్లు వ‌సూలు చేసిన ప‌వ‌న్ స‌న్నిహితురాలు – స్కామ్ బ‌య‌ట‌ప‌డ‌డంతో సాధారణ ఉద్యోగిని ఇరికించిన కోట రుక్మిణీ అండ్ గ్యాంగ్

 ‌*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్రెండ్ క‌మ్ పీఏ...
error: Content is protected !!