
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి. 16 నవంబర్ 2026.
రుద్రూర్ మండల కేంద్రంలోని రాణంపల్లి గ్రామంలో బిజెపి కార్యకర్త జిలకర మహేందర్ తండ్రి జిలకర సాయిలు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్థానిక బిజెపి నాయకుల ద్వారా తెలుసుకున్న బాన్సువాడ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించి, వారి కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు కటికె రామరాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్, బీజేవైఎం జిల్లా నాయకులు బోజుగొండ అనిల్, బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్, మండల నాయకులు జిలకర విజయ్, గాండ్ల ప్రవీణ్, బూత్ అధ్యక్షులు గొల్ల శంకర్ మరియు బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

