ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

ఆరు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు – సీరియల్ నిందితుడు అరెస్ట్* – 58.09 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూన్ 04:

తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: తాళంవేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న సీరియల్ నిందితుడిని అనపర్తి పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.58.09 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి, రావులపాలెం, కోరుకొండ, ఆలమూరు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఆరు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం గొంటువానిపాలెం గ్రామానికి చెందిన చిలపనశెట్టి సన్యాసిరావు (31) జూదానికి బానిసగా మారి డబ్బుల కోసం దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నాడు. 2019 సంవత్సరం నుంచి దొంగతనాలకు పాల్పడుతున్న అతడు, తాళం వేసి ఉన్న ఇళ్లను ముందుగానే గుర్తించి, యజమానులు లేని సమయంలో చోరీలు చేస్తూ వచ్చాడు.

ముద్దాయి సుమారు 45 పాత దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీటిలో సుమారు 20 కేసుల్లో కోర్టులు శిక్షలు విధించగా, ఆయా కేసుల్లో జైలుశిక్ష కూడా అనుభవించాడు. అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత తిరిగి జూదానికి అలవాటు పడి, డబ్బుల అవసరం పెరగడంతో మరలా దొంగతనాల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల అనపర్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైన చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అనపర్తి, రావులపాలెం, కోరుకొండ, ఆలమూరు, నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం ఆరు దొంగతనం కేసుల్లో తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
నిందితుడి వద్ద నుంచి సుమారు 385 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోగా వాటి విలువ రూ.57,75,000గా అంచనా వేశారు. అదేవిధంగా 110 గ్రాముల వెండి వస్తువులు (విలువ రూ.29,700) మరియు రూ.5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.58,09,700గా పోలీసులు వెల్లడించారు.

జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు, ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య పర్యవేక్షణలో రాజమహేంద్రవరం క్రైమ్ డీఎస్పీ ఏ. సుబాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. రాజమహేంద్రవరం క్రైమ్ సీసీఎస్ సీఐ వై. రాంబాబు, సీఐ బాలశౌరి, సీసీఎస్ ఎస్సై ఏ. ఆనందరెడ్డి, అనపర్తి ఎస్సై ఎల్. శ్రీను నాయక్ మరియు సీసీఎస్ సిబ్బంది సంయుక్తంగా పనిచేసి కేసును విజయవంతంగా ఛేదించారు.

కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

Latest Articles

బస్సు కండక్టర్‌పై దాడి దురదృష్టకరం బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలి

🔸 గాయపడిన ప్రవళికను పరామర్శించిన నేత 🔸 బాధితురాలు త్వరగా కోలుకోవాలని 🔹 కొత్తగూడెం...

భారత కార్మిక పోరాట దిక్సూచి ఏఐటీయూసీ 106 ఏళ్ల ఘన చరిత్ర కార్మిక వర్గానికే సొంతం

కార్మిక చట్టాల పరిరక్షణకు కదలాలి:ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యం కేంద్ర కార్మిక వ్యతిరేక...

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ...

కళాకారులను కాపాదుకుందాం -పలుస శంకర్ గౌడ్

కళాకారుడు జయరామ్ ను పరామర్శించిన సాహితీ కళా వేదిక సభ్యులు పొలిటికల్ పవర్...

వర్ని మహిళా సంఘాల నిధుల వ్యవహారంలో ఆర్టీఐ పోరాటం సక్సెస్

రూ.1.29 లక్షలు రికవరీ.. ఇంకా రూ.3 లక్షలు రావాల్సిందే! బాధ్యులపై చర్యలు తీసుకోవాలి...

Related Articles

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పెనుమూలిలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం

 దుగ్గిరాల: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డినాటి జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, నేటి ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం...

కూటమి నమ్మకద్రోహానికి ఓటుతో బుద్ధి చెప్పండి: చిలకలూరిపేట సమరశంఖంలో విడదల రజిని!

 చిలకలూరిపేట:పొలిటికల్ పవర్ ప్రతినిధిచిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. 4, 5, 6, 10, 33, 43, 47 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా...

కదిరిలో హోరెత్తిన వైఎస్సార్‌సీపీ ప్రచార భేరి!

కదిరి: పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డికదిరి రాజకీయ క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సరికొత్త వేడిని రగిలిస్తోంది. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బుల్ నేతృత్వంలో కేడర్...
error: Content is protected !!