
దస్తగిరి పి పొలిటికల్ పవర్ ప్రతి నిధి కర్నూలు
దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీ పార్టీని విడిచి ఆలూరు ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బుసినే విరూపాక్షి
అనంతరం ఎమ్మెల్యే శ్రీ బుసినే విరూపాక్షి మాట్లాడుతూ..రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి గారిపై, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిపై, పులివెందులో , రాయచోటలో దాడి, మరియు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో టీడీపీ చేస్తున్న హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని..ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు దురదృష్టకరం, ప్రజా మద్దతు గనక మీకు ఉంటే ధైర్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేసేలా చూడు చంద్రబాబు. ఓడిపోతానని భయంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చెలరేగిపోతున్నావు చంద్రబాబు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రక్త చరిత్ర రాస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలకు కనీస హక్కులు కూడా కరువయ్యాయి. నిత్యావసరాల ధరలు భారీగా పెరుగుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురుస్తున్నట్లు వ్యవహారిస్తోంది. పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో.. మీకు కనిపిస్తోందా చంద్రబాబూ? రాష్ట్రంలో ఏర్పడిన కరువు పరిస్థితుల్లో కూడా రైతులను నట్టేట ముంచేసిన చంద్రబాబు. రైతులనే కాదు మహిళలను విద్యార్థులను, ఉద్యోగస్తులను, చేనేతలను అన్ని వర్గాల ప్రజలకు అమలు చేయలేని అబద్ధపు హామీలతో వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. మీకు మిగిలింది కేవలం రెండేళ్ల సమయం మాత్రమే, ప్రజలు మీ దారుణాలన్నీ గమనిస్తున్నారు. తగిన సమయంలో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు మరియు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు
ఈ కార్యక్రమంలో దేవనకొండ మండలం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీ.కోటకొండ గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

