రిబ్బన్ కట్ చేసి ఇల్లు ప్రవేశాన్ని ప్రారంభించిన మండల అధ్యక్షుడు..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జహీరాబాద్: మండల పరిధిలోని హుగెల్లి గ్రామంలో మర్పల్లి తుకారాం నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశాన్ని ఆదివారం నాడు రిబ్బన్ కట్ చేసి, గుమ్మడికాయ కొట్టి ప్రారంభించిన జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంజీ రాములు ప్రారంభిచడం జరిగింది. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చి సొంతింటి కలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు, మాజీ సర్పంచ్, సిదన్న, మాజీ ఉప సర్పంచ్, మహిపాల్, గ్రామపంచాయతి మెంబర్లు పెంటన్న, రాములు, రచ్చమ్మ, హుస్సేన్, మరియు గ్రామం పెద్దలు ప్రభు, యేసప్ప, కిష్టన్న, అంజిరెడ్డి మొగులన్న,స్వామి, రావేందర్, తదితరులు పాల్గొన్నారు..



