బిక్కవోలు: తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు బిక్కవోలు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఊలపల్లి హైస్కూల్‌లో విద్యార్థినులకు కనెక్ట్ యూత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బిక్కవోలు ఎస్‌ఐ రవి చంద్ర కుమార్, ఏఎస్‌ఐ రఘు, పీసీ సురేష్ కుమార్ పాల్గొని మహిళల భద్రత, మహిళలపై జరుగుతున్న నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల సహాయం పొందే విధానాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
అలాగే గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యం, విద్యాభ్యాసం, భవిష్యత్తుపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు.
విద్యార్థులు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. యువతను సన్మార్గంలో నడిపించి, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.
