ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎంబీబీఎస్ సాధించిన పేద విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే

ఎంబీబీఎస్ సాధించిన పేద విద్యార్థినిని అభినందించిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

నిరుపేద కుటుంబంలో పుట్టి ఎంబీబీఎస్ సాధించడం గర్వించదగ్గ విషయం

విద్యార్థిని హేమావతిని అభినందించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ ఎంబీబీఎస్ సీటు సాధించడం గర్వించదగ్గ విషయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన బి. హేమావతిని ఆదివారం వనపర్తిలోని తన నివాసంలో ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… “పేదరికం చదువుకు అడ్డంకి కాదని నిరూపిస్తూ హేమావతి ఎంబీబీఎస్ సీటు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే విజయం తప్పక సాధ్యమవుతుంది. హేమావతి కష్టపడి చదివి వైద్యురాలిగా ఎదిగి సమాజానికి సేవ చేయాలి. ముఖ్యంగా పేదలకు వైద్య సేవలు అందించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు. హేమావతి తండ్రి బి. మాధవుడు 2019లో మృతి చెందగా, అప్పటి నుంచి ఆమె తల్లి బి. లత కూలి పని చేస్తూ కుమార్తెను చదివించారు. తల్లి కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని హేమావతి వైద్య విద్యలో అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. తనను అభినందించి ప్రోత్సహించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి హేమావతి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!