పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 7 2026: పెద్దమందడి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మంజులత మాట్లాడుతూ… డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడిగా సేవలందించి, అనంతరం భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా అత్యున్నత పదవులను అలంకరించారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తికి ఆయన ఎనలేని గౌరవం, కీర్తిని తీసుకువచ్చారని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దమందడి మండలంలో విద్యారంగానికి విశేష సేవలందిస్తున్న 17 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీతలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు
1. నళిని – ఆంగ్ల ఉపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బలిజపల్లి 2. వి. వాణి ప్రభ – ఆంగ్ల ఉపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మద్దిగట్ల మోజర్ల 3. సూర్య సంజీవ – గణిత ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెద్దమందడి 4. కృష్ణయ్య – గణిత ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జగత్‌పల్లి 5. వై. శేఖర్ – భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బలిజపల్లి 6. రవికుమార్ – వ్యాయామ ఉపాధ్యాయుడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వెల్టూరు 7. టీ. గీత – ప్రధానోపాధ్యాయురాలు, ప్రాథమిక పాఠశాల, జగత్‌పల్లి 8. పి. శ్రీనివాసులు – ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాల, దొడగుంటపల్లి 9. వి. చంద్రకళ – ప్రాథమిక పాఠశాల, పెద్దమందడి 10. లక్ష్మణ్ – ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, పామిరెడ్డిపల్లి 11. దర్గయ్య – ఉపాధ్యాయుడు, ప్రాథమికోన్నత పాఠశాల, అల్వాల 12. శ్రీలక్ష్మి – ఉపాధ్యాయురాలు, ప్రాథమిక పాఠశాల, బలిజపల్లి 13. యుగేందర్ – ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, మోజర్ల 14. నరసింహ – ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల, గట్ల ఖానాపూర్ 15. పుష్పలత – ఉపాధ్యాయురాలు, ప్రాథమిక పాఠశాల, గట్ల ఖానాపూర్ 16. ఎన్. అరుణ – తెలుగు ఉపాధ్యాయురాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, పెద్దమందడి 17. పి. కృష్ణమ్మ – చేతిపనుల ఉపాధ్యాయురాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మద్దిగట్ల మోజర్ల అదేవిధంగా విశిష్ట సేవా పురస్కారానికి జి.కె. శ్రీనివాస్, ఉపాధ్యాయుడు ఎంపికై సన్మానం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మద్దిగట్ల మోజర్ల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి రేవల్లి, పెద్దమందడి పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు శాంతన్న, వెల్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాణం విష్ణు, పెద్దమందడి సర్పంచ్ గంగమ్మ, మనీగిళ్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, రేవల్లి పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అవార్డు గ్రహీతలు, పెద్దమందడి మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
