ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపఎన్యుమరేషన్ ఫామ్ ను ఈనెల పదవ తేదీ లోపల పూర్తి చేసి బిఎల్వోలకు సమర్పించాలి..

ఎన్యుమరేషన్ ఫామ్ ను ఈనెల పదవ తేదీ లోపల పూర్తి చేసి బిఎల్వోలకు సమర్పించాలి..

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ పిన్ 9టీవీ సమగ్ర జాతీయ దిన పత్రిక రిపోర్టర్, ఏం. ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా జులై 05 2026: బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో లింగారెడ్డి పల్లె గ్రామపంచాయతీలో ప్రజలకు ఇచ్చిన ఎన్యుమరేషన్ దరఖాస్తు ఫారాన్ని పూర్తిచేసి ఈనెల 10వ తేదీ లోపల స్థానిక బి ఎల్ ఓ లకు సమర్పించాలని లింగారెడ్డి పల్లె బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన హృదయ పేట, నల్ల గుండు పల్లి, లింగారెడ్డి పల్లె గ్రామాలలో పర్యటించి ఓటర్ల దగ్గర నుండి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకున్నారు. వీటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని తెలిపారు. ఈ ఎన్యూమరేషన్ ఫారాలకు ఆధార్ మరియు ఫోటో తప్పనిసరి అని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 10 తేదీ లోపల దరఖాస్తులు అందించాలని తెలిపారు. అలాగే ఆయా ప్రాంతాలలో ఉన్న సహాయకులు సంబంధిత ఓటర్లను అడిగి వివరాలు సేకరించి పంపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెలుగు అని మీటర్ విజయమ్మ, అంగన్వాడీ కార్యకర్త వరకు మారి, ఆశ కార్యకర్త గురమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!