ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఎవరైనా18 సంవత్సరాలునుంచి59సంవత్సరాలు లోపు వారు ప్రమాదవశాత్తు సహజమరణంతో చనిపోతే వాళ్లకి 20 వేల రూపాయలు వస్తాయి 

ఎవరైనా18 సంవత్సరాలునుంచి59సంవత్సరాలు లోపు వారు ప్రమాదవశాత్తు సహజమరణంతో చనిపోతే వాళ్లకి 20 వేల రూపాయలు వస్తాయి 

📰 Generate e-Paper Clip

– రాబోయే రోజుల్లో వర్షాకాలం ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో ఈగలు, దోమలు ఎక్కువగా ఉండడంతోమన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం నీటిగా శుభ్రంగా పెట్టుకోవాలి,

– ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయి,మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో 

చేర్పించాలి, ఆదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఖి మ్యా నాయక్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో 06.జూన్ 2026: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దాంట్లో 18 సంవత్సరాలు నుంచి 59 సంవత్సరాలు లోపు ఎవరన్నా చనిపోతే వాళ్లకి 20 వేల రూపాయలు వస్తాయని, భార్య గాని భర్త గాని కొడుకులు గాని బిడ్డ గాని ఎవరైనా ప్రమాదవశాత్తు తో కానీ సహజమరణం కానీ ఏదైనా ఉన్న మీరు ఒక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ ను ఎంఆర్ఓ ఇస్తారు . అన్ని కాగితాలను మున్సిపల్ ఆఫీసులో ఇస్తే దానికి మీకు ఇరవై వేల రూపాయలు వస్తాయి కుటుంబ ప్రయోజనపథకాన్నిప్రతిఒక్కరుఉపయోగించుకోవాలని ఆదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఖి మ్యా నాయక్ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ పరిధిలోని దండుగడ్డలో గల అంగన్వాడి ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 4,5,6,7, వార్డులకు సంబంధించి ప్రత్యేక గ్రామ సభనునిర్వహించారు.కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పి. అరుణ శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఆదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఖిమ్యా నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ మండల స్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రత, వనమహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు సహా తదితరాంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పి. అరుణ శ్రీనివాస్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి ప్రజల మెప్పు పొందుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పైనే సీఎం తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. కేవలం వనపర్తి నియోజకవర్గం లోని మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రజా ప్రభుత్వం 10 లక్షల రూపాయలకు పెంచిందన్నారు. పేద ప్రజలు విద్యుత్ భారం ఇబ్బందులు పడకుండా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు. అదేవిధంగా రైతులకు రైతు భరోసాతో పాటు రెండు లక్షల రుణమాఫీని చేసి అండగా నిలుస్తుంది అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా నిరుపేదలకు ఇండ్లు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తుందని ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని సూచించారు. అమ్మాయిలకు బాల్యవివాహాలు చేయకుండా ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చాయని కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం జయప్రకాష్ కాలనీ సమస్యలపై మున్సిపల్ కౌన్సిలర్ అఖిల సుభాష్, అధ్యక్షులు యస్. ఈశ్వర్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ కు వినతిపత్రం అందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సైదయ్య, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, మదనాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్ జె. బోహెజ్, పి రవీందర్ రెడ్డి , నబీ మాస్టర్ , మురళి యాదవ్ , తిరుపతయ్య , ముంత మంజుల రామకృష్ణ ,జే అఖిల సుభాష్ , పి. గాయత్రి సత్యం సాగర్ ,భీమ చంద్రకాంత్, సంజీవుడు ,పి. సుధా రామ్మోహన్ రెడ్డి , అజ్మత్ ఖాన్ సలీం , బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి,పోలీస్ శాఖ, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖ, ఐసీడీఎస్ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!