పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో కారం వెంకటేష్ ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల బతుకులకు భరోసా దొరకటం లేదని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ కులాల జిల్లా మండల డెవలప్మెంట్ చైర్మన్ ల ప్రమాణ స్వీకారానికి ఆదివారం ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ డెవలప్మెంట్ చైర్మన్ మానుకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణను షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ శాలువాతో సగరువంగా సన్మానించి వినతి పత్రం అందజేశారు.ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలకు జరుగు తున్న అన్యాయాన్ని వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ టి పిసిసి ప్రెసిడెంట్ హోదాలో రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చినారు.కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేసినాము అట్టి హామీని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల బతుకులకు భరోసా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతమంది మంత్రులను కలిసిన ముఖ్యమంత్రి దృష్టికి దారి చూపటానికి సుముకుత చూపటం లేదని అన్నారు. ఈ సమస్యపై స్పందించి సంబంధిత శాఖా పరమైన చర్యలు చేపట్టి ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాలు కోల్పోయిన స్థానిక ఎస్సీ రిజర్వేషన్ తిరిగి అమలు చేయాలని, సాగు భూములకు పంట రుణాలు పొందే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ కులాల జనాభా పెరిగింది. పెరిగిన జనాభా కనుగుణంగా ఎస్సీ రిజర్వేషన్ 20% పెంచాలని కోరారు. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, కర్లపూడి సుందర్ పాల్, నరాల రాజేష్, ఎనగంటి శ్రీనివాస్, జిమ్మిడి సుమన్, కుమ్మరి వెంకటేశ్వర్లు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

