పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: గోపిరెడ్డి జైపాల్రెడ్డి స్మారకార్థం సత్య సోదక్ సమతా సమాజ్ అధర్యంలో ఏఐ .మాస్టర్ కోర్సు 30 రోజుల శిక్షణా కార్యక్రమం వనపర్తి టౌన్ లోని వెల్నెస్ సెంటర్ లో గురువారం రోజు జరిగిన ఏఐ ఉచిత శిక్షణ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొ న్నారు.సునీల్ రెడ్డి వారి సోదరుడు గోపిరెడ్డి జైపాల్రెడ్డి స్మారకార్థం సొంతం డబ్బులతో ఉచిత శిక్షణ కోసం ఆర్థిక సహాయం చేయడం అభినందనీయ ద్దగ్గ విషయం అన్నారు. సునీల్ రెడ్డి కలసి శిక్షణను ప్రారంభించారు. శంకర్ గౌడ్ మాట్లాడుతూ… ప్రపంచం అంతా నేడు ఏఐ వైపు పరుగులు తీస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, రేపటి ఉపాధికి మార్గం. ఏఐ నేర్చుకుంటే ఉద్యోగం మన వెంట వస్తుందని, పల్లెటూరి యువత కూడా ప్రపంచ స్థాయి టెక్నాలజీ నేర్చుకోవాలని, నెలకు 30-50 వేలు సంపాదించే అవకాశం ఉందని అన్నారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్ తో పాటు ఉపాధి మార్గాలు చూపిస్తామని, యువత క్రమశిక్షణతో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర అధ్యక్షుడు – కిరణ్ సాగర్ ఉపాధ్యక్షుడు – మద్దిలేటి ప్రధాన కార్యదర్శి – ప్రశాంత్ బిబి కోశాధికారి – పి శ్రీనివాసులు ఏఐ ట్రైనర్ – కిరణ్ స్పాన్సర్ – గోపి రెడ్డి సునీల్ రెడ్డి స్టెప్ సంస్థ ఆర్గనైజర్ – రామక్రిష్ణ మరియు ఏత్తం కృష్ణయ్య, పి బాలకృష్ణ, వై బాలకృష్ణ తదితరులు నిర్వాహకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.
