ePaper
Monday, August 17, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిఏనుగుంట ఆయకట్టు రైతుల నోట్లో మట్టికొడుతున్న ఇరిగేషన్ శాఖ.

ఏనుగుంట ఆయకట్టు రైతుల నోట్లో మట్టికొడుతున్న ఇరిగేషన్ శాఖ.

📰 Generate e-Paper Clip

కాగితాల్లో పారుతున్న కాలువలు – పొలాల్లో ఎండుతున్న పంటలు.

మిగిలిన 5.0718 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లే.

​ ఏసీ గదుల్లో కూర్చుని ఫైళ్లపై సంతకాలు ప్రాజెక్టు పూర్తయిందని అబద్ధపు లెక్కలు. 

టిఆర్పి వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్. పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 17 2026: ఏనుగుంట రిజర్వాయర్ ఆయకట్టు పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని నీళ్లలో పోసి,క్షేత్రస్థాయిలో రైతులకు చుక్క నీరు కూడా అందించకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్పి)వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షుడు జి. రవికుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వనపర్తి జిల్లా మదనాపురం మండలం తీర్మాలయపల్లి గ్రామ శివారులోని రైతులకు ఏనుగుంట రిజర్వాయర్ ఆయకట్టు ప్యాకేజీ-15 డిస్ట్రిబ్యూటర్ కాలువ D1 ద్వారా తీర్మాలయాపల్లి గ్రామ రైతుల పొలాలకు నీరందక వేలాది ఎకరాల భూములు బీడు బీములుగా మారుతున్నాయని,బోర్లు ఉన్న అవి సరైన పోయట్లేదని,ఇరిగేషన్ అధికారులకు ఆయన మదనాపురం మండలం ప్రజావాణిలో బహిరంగ హెచ్చరికలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “తీర్మాలయపల్లి”తో పాటు ఆమడబాకుల,చర్లపల్లి,సత్యహాళ్ళి,వడ్డేవాటా గ్రామాల పరిధిలోని 3,211 ఎకరాల సాగుభూములకు నీరిస్తామని చెప్పి రూ. 71.2751 కోట్లు కేటాయించారు.అందులో రూ.66.2033 కోట్లు ఖర్చు చేశామని లెక్కలు చూపిస్తున్నారు.కానీ తీర్మాలయపల్లి గ్రామ రైతు వ్యవసాయ పొలాలకు నేటికీ చుక్క నీరు రాక రైతులు ఎండమావులను చూస్తూ అప్పులపాలవుతున్నారు.ఈ మిగిలిన రూ. 5.0718 కోట్లతో పాటు,ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?” అని నిలదీశారు.కాగితాల్లో పారే కాలువలు – పొలాల్లో ఎండుతున్న పంటలని,శాఖ అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని ఫైళ్లపై సంతకాలు చేస్తూ,ప్రాజెక్టు పూర్తయిందని అబద్ధపు లెక్కలు చెప్తున్నారని ఆరోపణలు చేశారు.క్షేత్రస్థాయికి వస్తే కాలువల్లో నీరు కాదు కదా… పిచ్చిమొక్కలు,ముళ్ల పొదలు,పూడిక మాత్రమే కనిపిస్తున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, అధికారులు వ్యవస్థీకృత దోపిడీ కేవలం ‘కాలువలు శుభ్రం చేస్తాం’ అనే తుడిచిపెట్టు హామీలతో రైతులను మోసం చేస్తున్నారని హెచ్చరించారు. గతంలో జరిగిన పనులు,స్వాహా చేసిన నిధులు, కాలువల శోచనీయ స్థితిపై సమగ్రమైన విచారణ జరిపి తీరాల్సిందేనన్ని కోరారు.యుద్ధప్రాతిపదికన చర్యలు, తక్షణమే కాలువలు, శుభ్రం చేసి బాగుచేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని తెలిపారు.నిధుల దుర్వినియోగానికి పాల్పడిన బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఇరిగేషన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తక్షణమే స్పందించి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టకపోతే,అధికారుల నిర్లక్ష్యాన్ని,అవినీతి ఆధారాలను ప్రజా క్షేత్రంలో పెట్టి, ఇరిగేషన్ శాఖ ఆఫీసులను ముట్టడిస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ( టీఅర్పి) ఆధ్వర్యంలో హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!