పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బస్టాండ్ అడ్డా టి ఏ డి యు నుంచి ఏఐటీయూసీ పోరాటాలకు ఆకర్షితులై 50 మంది ఆటో కార్మికులు ఏఐటీయూసీలోకి చేరారు సోమవారం వారికి ఏఐటియుసి (ఆటో వర్కర్స్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం. మండల కమిటీ వేయడం జరిగింది. జూలూరుపాడు బస్టాండ్ అడ్డా ఏ ఐ టి యు సి మండల అధ్యక్షులు మోటపోతుల ఆనందరావు. మండల ఉపాధ్యక్షులు పోతురాజు మురళీకృష్ణ మరియు సపవట్ బాబూలాల్. మండల సెక్రెటరీ మంద లక్ష్మీనారాయణ మరియు ఆర్గానేజర్ కంగల రంజిత్ కుమార్. కోశాధికారి మరియు రవీంద్ర కుమార్. ట్రెజరర్ కొండసత్యనారాయణ. మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జములయ్య మాట్లాడుతూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి కాలం ప్రభుత్వం గడుపుతున్నారని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు ఆటో స్టాండ్లు లను ఏర్పాటు చేయాలని అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరార. ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆటోలు ముంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కంచర్ల రాఘవేంద్రరావు, వలమల సామేలు గార్లపాటి వీరభద్రం యాసా రోశయ్య సిరిపురపు వెంకటేశ్వర్లు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు గార్లపాటి శివకృష్ణ కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ అబ్బులు సూపర్ బజార్ అడ్డా అధ్యక్షులు మోహన్ మాజీ అధ్యక్షులు దేశి జూలూరుపాడు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
