ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషితో ఏదుల రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం..
22 మంది రైతులకు రూ.1.21 కోట్ల రూపాయల విలువగల చెక్కుల పంపిణీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 06 2026: ఏళ్ల తరబడి పరిహారం కోసం ఎదురుచూస్తున్న తమకు నేడు పరిహారం అందడంతో ఏదుల గ్రామానికి చెందిన అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ, కృషి వల్లే తమకు నష్టపరిహారానికి సంబంధించిన చెక్కులు అన్యాయని, ఏల్ల నాటి నిరీక్షణకు తెరపడిందని, తమ కష్టాన్ని అర్థం చేసుకుని పరిహారం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన బాధిత రైతులకు శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రభుత్వం తరఫున మంజూరైన నష్టపరిహారం పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 22 మంది రైతులకు సంబంధించి మొత్తం 9.28 ఎకరాల భూమికి రూ.1 కోటి 21 లక్షల పరిహారాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. రైతుల కన్నీళ్లు తుడవడం.. వారి కష్టాల్లో అండగా నిలవడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యతని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం అందించడానికి ప్రాధాన్యతనిస్తూ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఏదుల మండల అధ్యక్షులు సుఖేందర్ రెడ్డి, మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు సత్యశీలారెడ్డి, జిల్లా నాయకులు వాడల పర్వతాలు, జయపాల్ రెడ్డి, NSUI ఉమ్మడి గోపాల్పేట అధ్యక్షులు జానకి రాములు, ఎస్సీ సెల్అ ధ్యక్షులు కృష్ణయ్య, గొల్లపల్లి సర్పంచ్ సంతోష, భాస్కరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


