గోదావరి తల్లికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేసిన ప్రజలు, నాయకులు
సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల్లో ఆనందం వ్యక్తం
పొలిటికల్ పవర్ దినపత్రిక / పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలోని కప్పల బంధం లాకుల వద్దకు గోదావరి జలాలు చేరడంతో మండల ప్రజలు, నాయకులు గోదావరి తల్లికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషి, చొరవతో వైరా రిజర్వాయర్‌కు చేరిన గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ ఈరోజు సాయంత్రం కల్లూరు మండల పరిధిలోని కప్పల బంధం లాకుల వద్దకు చేరుకున్నాయి.
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగుకు నీటి కొరత నెలకొన్న సమయంలో గోదావరి జలాలు కల్లూరు మండలానికి చేరుకోవడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కప్పల బంధం వద్ద గోదావరి తల్లికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

