ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంకుళ్ళిన అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ

కుళ్ళిన అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ దమ్మపేట జూలై6 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని జమేదారు బంజర పరిసర అటవీప్రాంతంలో ఈ నెల 1 వ తేదీన మృతి చెందిన అనాద మహిళా మృతదేహానికి సోమవారం గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ ఆద్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. స్ధానిక పోలీసులు అనాద మృతదేహాన్ని గత మూడు రోజుల క్రితం అశ్వారావుపేట లోని ప్రభుత్వ వైద్యశాల కు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతదేహానికి సంబందించిన బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాధగా గుర్తించిన పోలీసులు మందలపల్లి కి చెందిన గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ సహాయాన్ని కోరారు. కాగా మందలపల్లి పంచాయతీ కార్యదర్శి ,పోలీసుల సమక్షంలో గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ నిర్వాహకులు అనాద మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. కార్యక్రమంలో సంస్ధ వ్యవస్ధాపకులు పాలడుగుల అబ్బులు ,షేక్ అజీమ్ , రొయ్యల కుమార్ ,జెసిబి సోము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!