ePaper
Tuesday, September 8, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కె.సి.ఆర్., కె.టి.ఆర్., హరీష్ రావు, టాటా మధు దిష్టిబొమ్మల దహనం.

కె.సి.ఆర్., కె.టి.ఆర్., హరీష్ రావు, టాటా మధు దిష్టిబొమ్మల దహనం.

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నల్ల చొక్కాలు వేసుకొని అసెంబ్లీకి వస్తున్న క్రమంలో,పోలీసులు నల్ల చొక్కాలతో అసెంబ్లీకి అనుమతి లేదని అడ్డుకోవడంతో అక్కడ ఉన్న పోలీసు సిబ్బందిపై భౌతికంగా దాడులు చేస్తూ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అప్రజాస్వామికంగా బూతు పదాలు వాడుతూ దూషించడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మల దహనం చేశారు. పిసిసి మరియు పిసిసి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ నాగరాజు చిలకమర్రి మరియు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్టలోని భూదేవి హిల్స్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ డా. గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర వైస్ చైర్మన్ మరియు జిల్లా చైర్మన్ కవ్వాలి చంద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో క్యూబిఆర్ బి-బ్లాక్ కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ సోల్మన్ రాజు, 280వ డివిజన్ అరుణ్ కుమార్, 295వ డివిజన్ మైనారిటీ ప్రెసిడెంట్ షేక్ షరీఫ్,289బి డివిజన్ ప్రెసిడెంట్ గడ్డం ప్రసాద్, మాజీ డిసిసి వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్ కుమార్, కౌసల్య, మాధవి రెడ్డి, లలిత, యువరాజ్, సోమేష్, రాహేష్, ధనుష్, భూని, సన్నీ, మనీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!