మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎం.ఆర్.పి.ఎస్ హైదరాబాద్ జిల్లా నాయకులు డప్పు మల్లికార్జున్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ సి ఎల్ ఆపరేషన్ కోసం నాలుగు నెలలుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్న పేద రోగులకు, అవసరమైన ఇంప్లాంట్లు,పరికరాలు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడం విచారకరమని అన్నారు. గర్భిణీ స్త్రీలు, అత్యవసర రోగులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.వీల్‌చైర్లు, స్ట్రెచర్లు సమయానికి అందక, రోగుల కుటుంబ సభ్యులే వాటిని తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.పేదల ప్రాణాలతో చెలగాటం ఆడే ఈ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి, అవసరమైన ఇంప్లాంట్లు, పరికరాలు,సిబ్బందిని సమకూర్చి,పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోతే,ఈ విషయాన్ని ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

