షేక్ బాజీ బాబా జిల్లా అధ్యక్షుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ IUML ఖమ్మం జిల్లా.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి గోపాల్ రావు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయమని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ IUML జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య విజయమని, శాంతి,సహనం,పట్టుదలకు దక్కిన విజయమని, భయాన్ని వీడి దేశం నలుమూలల నుండి ముందుకు వచ్చిన పౌరులందరీ సమిష్టి పోరాటం అని ఆయన అన్నారు.
కక్రోచ్ జనతా పార్టీ
CJP ఒక ఉద్యమాన్ని సృష్టించిందని, దీనికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది. బొద్దింకలు ఏమి చేయలేవని బిజెపి అవహేళన చేసిందని, యువత విద్యార్థి లోకం అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో నేడు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయక తప్పలేదని, ఆయన అన్నారు. ఇది ఒక వ్యక్తి రాజీనామా కాదు అని విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం అని ఆయన అన్నారు. నీట్ పరీక్ష లీకేజీతో ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వారంతో మంది ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని, విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి దేశం మొత్తం యువత విద్యార్థి లోకం యావత్ ప్రపంచం పోరాటపటిమను చూపించిందని, జంతర్ మంతర్ లో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని విద్యార్థులు చేపట్టిన తరుణంలో వారిపై దౌర్జన్యంగా దుర్మార్గంగా, లాఠీ చార్జ్ చేయడం భాస్పవాయువు ప్రయోగించడం,
పలు రకాల అణిచివేతలను దేశ యువత విద్యార్థి లోకం గట్టిగా ఎదుర్కొంది.
దీంతో కేంద్రం దిగివచ్చి ఏదైతే విద్యార్థులు యువత పెట్టిన డిమాండ్లను పరిష్కరించే దిశగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగిందని ఆయన అన్నారు. నీట్ పరీక్ష లీకేజీతో ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారని, అతి విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, అదేవిధంగా ఇప్పుడు ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులపై యువతపై కేసులో నమోదు అయ్యాయని అట్టి కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఇండియన్ యూనియన్ పార్టీ IUML జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

