ePaper
Monday, September 7, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికొత్తకోట గణేష్ ఉత్సవాలపై పోలీసుల ఫోకస్

కొత్తకోట గణేష్ ఉత్సవాలపై పోలీసుల ఫోకస్

📰 Generate e-Paper Clip

 –మండపలనిర్వాహకులుసోమవారంనిర్వహించేసమావేశానికి హాజరు కావాలి సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ విక్రమ్ అదేశం,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్.06.2026.వనపర్తిజిల్లాకొత్తకోటమండలంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.ఉత్సవాలనుప్రశాంతవాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర అంశాలపై మండపాల నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకుపోలీసులుకీలకసమావేశాన్నినిర్వహించనున్నారని కొత్తకోట సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ విక్రమ్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం 10 గంటలకు కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మండలంలోని అన్ని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు కొత్తకోట ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఉత్సవాల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపైపోలీసులుసూచనలుఇవ్వనున్నారు.మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన గణేష్ మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులుతప్పనిసరిగా సమావేశానికి హాజరై పోలీసు శాఖకుసహకరించాలని ఎస్‌ఐ విక్రమ్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!