ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

కొత్త పదవులతో కాంగ్రెస్ నేతల్లో ఆనందం.. శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 28 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కొమ్ము వెంకటస్వామిని, పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్‌గా నియమితులైన కొత్త కాపు వెంకటేశ్వర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ… కొత్త బాధ్యతలతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొమ్ము వెంకటస్వామి మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, వెంకటేశ్వర రెడ్డి రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన కొమ్ము వెంకటస్వామి, వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, ప్రజాసేవ కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, సర్పంచులు సూర్య గంగా రవి, వెల్టూరు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి. బంగ్లా బాబు. రాఘవేందర్. ప్రవీణ్ రెడ్డి. నరేష్. రాధాకృష్ణ. ఉప సర్పంచ్ ఉషన్న స్వరూప, రాములు యాదవ్, వెంకటేష్, మాజీ సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, సిద్దయ్య, త్రినాథ్, బాబు రెడ్డి, శ్రీశైలం, రాఘవేందర్, నరేష్, ప్రవీణ్ రెడ్డి, మల్లికార్జున్, ప్రేమ్ సాగర్, మొగిలయ్య, ఉషన్న, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

Latest Articles

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా...

Related Articles

పుట్టుచీర కార్యక్రమానికి హాజరైన మోజర్ల సర్పంచ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామానికి చెందిన జక్కని ఆంజనేయులు–అర్చన...

ఎంబీబీఎస్ విద్యార్థికి అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ప్రోత్సాహకం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 2026: పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామానికి చెందిన గట్టు రమేష్ కుమారుడు గట్టు యువరాజ్...

పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ఉచిత ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష విజయవంతం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల దిశగా మార్గనిర్దేశం చేయడంతో...
error: Content is protected !!