బీఎల్‌ఓలు, బీఎల్‌ఏ-2లకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 28 2026: పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 కార్యక్రమం విజయవంతంగా 100 శాతం పూర్తి అయింది. గ్రామంలోని బూత్ నంబర్లు 78, 79, 80, 82 పరిధిలోని ఓటర్ల వివరాలను పూర్తిస్థాయిలో డిజిటల్ నమోదు చేసి లక్ష్యాన్ని సాధించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను సకాలంలో బీఎల్‌ఓలకు అందించడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.
భవిష్యత్తులో ఓటరు జాబితాకు సంబంధించిన ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బీఎల్‌ఏ-2లు, ఎన్నికల సిబ్బంది, అధికారులు, గ్రామ ప్రజలకు సర్పంచ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అందించిన సహకారంతోనే పామిరెడ్డిపల్లి గ్రామం 100 శాతం నమోదు లక్ష్యాన్ని చేరుకుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఇంద్రా లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచులు సిద్ధయ్య, తిక్కన్న, వార్డు సభ్యులు కృష్ణ, నరేష్, భాస్కర్, కొంకలి నరసింహ, మండల ఆర్‌ఐ శంకర్, జీపీవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, బీఎల్‌ఓలు సునీత, లక్ష్మి, భాగ్యమ్మ, శారద, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఎన్నికల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

