ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిగన్ లైసెన్స్ హోల్డర్లు ఆయుధాలను చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా వినియోగించాలి

గన్ లైసెన్స్ హోల్డర్లు ఆయుధాలను చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా వినియోగించాలి

📰 Generate e-Paper Clip

–  జిల్లా పోలీసు కార్యాలయంలో గన్ లైసెన్స్ హోల్డర్లకు ప్రత్యేక అవగాహన మేళా నిర్వహించిన ఎస్పీ, ప్రతి లైసెన్స్‌ను స్వయంగా పరిశీలించిన ఎస్పీ, లైసెన్స్ హోల్డర్ మరణిస్తే ఆయుధాన్ని పోలీసులకు అప్పగించి లైసెన్స్ రద్దు చేసుకోవాలి,

–  ఆయుధాల భద్రత, చట్టబద్ధ వినియోగంపై రాజీ లేదన్న జిల్లా ఎస్పీ.సునిత రెడ్డిఐపీఎస్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 29.2026.

జిల్లాలో గన్ లైసెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆయుధాలను చట్టబద్ధమైన అవసరాలకు మాత్రమే వినియోగిస్తూ సమాజ భద్రత పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని, ఆయుధాన్ని కలిగి ఉండటం ఒక హక్కు మాత్రమే కాకుండా ప్రజల ప్రాణ, ఆస్తుల భద్రతను కాపాడే బాధ్యత కూడా అని జిల్లా ఎస్పీ.సునిత రెడ్డిఐపీఎస్,పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో వనపర్తి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్  గన్ లైసెన్స్ హోల్డర్స్ కు ప్రత్యేక అవగాహన మేళా నిర్వహించి జిల్లాలోని గన్ లైసెన్స్ హోల్డర్లతో ప్రత్యక్షంగా సమావేశమై ప్రతి లైసెన్స్‌ను స్వయంగా పరిశీలించి, ఆయుధాల భద్రత, లైసెన్స్ నిబంధనలు, రెన్యువల్, వారసత్వ బదిలీ, చట్టపరమైన బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం గన్ లైసెన్స్ మంజూరు చేయడం అంటే కేవలం ఆయుధాన్ని కలిగి ఉండేందుకు అనుమతి ఇవ్వడం మాత్రమే కాదు… చట్టాన్ని గౌరవిస్తూ సమాజ భద్రతను పరిరక్షించే బాధ్యతను మీపై నమ్మకంతో అప్పగించినట్టే. ప్రతి గన్ లైసెన్స్ హోల్డర్ ఆ విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా చట్టాన్ని అక్షరాలా పాటిస్తూబాధ్యతాయుతంగావ్యవహరించాలి.ఆయుధాలను వ్యక్తిగత కక్షలు, భూవివాదాలు, రాజకీయ విభేదాలు, సామాజిక కార్యక్రమాలు లేదా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా ఆయుధాలను ప్రదర్శించడం, బెదిరింపులకు ఉపయోగించడం లేదా నిర్లక్ష్యంగా నిర్వహించడం వంటి చర్యలను పోలీసు శాఖ ఏమాత్రం సహించదని, అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రతి గన్ లైసెన్స్ హోల్డర్ తన లైసెన్స్ గడువును ఎప్పటికప్పుడు పరిశీలించి, గడువుముగియకముందే తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. గడువు ముగిసిన లైసెన్స్‌తో ఆయుధాన్ని కలిగి ఉండటం కూడా చట్టపరమైననేరమేననిపేర్కొన్నారు. ఆయుధాలను ఎల్లప్పుడూ భద్రమైన ప్రదేశంలో ఉంచి, అనుమతి లేని వ్యక్తుల చేతికి చేరకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనిసూచించారు. లైసెన్స్ హోల్డర్ మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యులు లేదా వారసులు ఆలస్యం చేయకుండా సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా జిల్లా పోలీసు కార్యాలయానికి సమాచారం అందించి ఆయుధాన్ని వెంటనే పోలీసుల వద్ద డిపాజిట్ చేయాలని సూచించారు. అనంతరం చట్టబద్ధమైన విధానంలో గన్ లైసెన్స్ రద్దు లేదా వారసత్వ బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సంబంధిత అధికారులతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఇలాంటి కేసులను వెంటనే గుర్తించి గన్ లైసెన్స్ రద్దు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.చట్టాన్ని గౌరవించే ప్రతి గన్ లైసెన్స్ హోల్డర్ పోలీసు శాఖకు బాధ్యతాయుత భాగస్వామిగా ఉంటూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించాలని, ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ అన్నారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, డిసిఆర్బి డిఎస్పీ, బాలాజీ నాయక్, వనపర్తి సీఐ,సుగంధ రత్నం, కొత్తకోట సీఐ,రాంబాబు, ఆత్మకూర్ ఏ. శివకుమార్ స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, డిసిఆర్బి ఎస్సై,తిరుపతిరెడ్డి, జిల్లాలోని ఎస్సైలు గన్ లైసెన్స్ హోల్డర్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!