ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిగర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలి

గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలి

📰 Generate e-Paper Clip

– పీహెచ్‌సీల్లోనే పాము కాటు బాధితులకు తక్షణ వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11. 2026.గర్భిణుల్లో రక్తహీనతనుగుర్తించిమెరుగైన చికిత్స అందించాలని, పీహెచ్‌సీల్లోనే పాము కాటు బాధితులకు తక్షణ వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండలం కడుకుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించి వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యసిబ్బందినివివరాలుఅడిగితెలుసుకున్నారు.ముఖ్యంగా పాము కాటు బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపైకలెక్టర్,ఆరాతీశారు.ఆసుపత్రిలోఅందుబాటులో ఉన్న మందులు, యాంటీ స్నేక్ వెనం (ఏఎస్‌వీ) నిల్వలు, వాటి వినియోగం, పాము కాటు కేసులు వచ్చినప్పుడు చేపడుతున్న వైద్య ప్రక్రియ తదితర అంశాలనువైద్యాధికారులనుఅడిగితెలుసుకున్నారు.ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాము కాటు బాధితులకు పీహెచ్‌సీ స్థాయిలోనే తక్షణ వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన మందులు, యాంటీ స్నేక్ వెనం(పాము కాటు విరుగుడు టీకా) ఎల్లప్పుడూ అందుబాటులోఉండేలాముందస్తుచర్యలుచేపట్టాలని సూచించారు. పాము కాటు కేసుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ప్రాథమిక చికిత్స అందించి, అవసరమైన సందర్భాల్లో ఉన్నత స్థాయివైద్యసేవలకుతరలించేలా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణుల వివరాలు, వారి ఆరోగ్యపరిస్థితి, వారికిఅందుతున్నవైద్యసేవలపైకలెక్టర్,సమీక్షించారు.ముఖ్యంగారక్తహీనతతోబాధపడుతున్న గర్భిణులను గుర్తించి, వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటుఅవసరమైనపరీక్షలునిర్వహించాలనివైద్యాధికారులను ఆదేశించారు.రక్తహీనత ఉన్న గర్భిణులకు వైద్యుల సూచనల మేరకు మందులు,పోషకాహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, చికిత్సా గదులు, మరుగుదొడ్లు తదితరప్రాంతాల్లోపారిశుధ్యాన్నినిరంతరంపరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.రోగులకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి
పదవ తరగతిలో ఈ ఏడాది జిల్లాలో 100. శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కడుకుంట్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిజిక్స్, గణితం, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లోప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు బోధించాలని సూచించారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆయా సబ్జెక్టుల్లోవెనుకబడిన విద్యార్థులను పాఠ్యాంశాలు అర్థమయ్యే విధంగా బోధించి 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలోపరిశుభ్రతకుప్రాధాన్యంఇవ్వాలనిసూచించారు.విద్యార్థులుఆడుకోవడానికిసౌకర్యంగామైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలనిఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ రాకేష్ రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!