బీసీ పొలిటికల్ జెఎసి పోరాటంతో మరో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్
గతంలో కూడా అవినీతి అధికారులను సస్పెండ్ చేయించిన ఘనత మాదే
బీసీ పొలిటికల్ జెఎసి ఖాతాలో మరో విజయం
-జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: జిల్లాలో అవినీతి అధికారుల భరతం పట్టడమే తమ లక్ష్యమని బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో వనపర్తి బీసీ హాస్టల్ వార్డెన్ అవినీతి బాగోతాన్ని సాక్ష్యాధారాలతో బయట పెట్టడంతో పాటు అడిషనల్ కలెక్టరుకు ఫిర్యాదు చేయడం జరిగిందని గుర్తు చేశారు. దీంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు హాస్టల్ వార్డెన్ మరియు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అవినీతి అధికారుల సస్పెండ్ తో బీసీ పొలిటికల్ జేఏసీ ఖాతాలో మరో విజయం నమోదయిందని తెలిపారు. గతంలో ఎంతో మంది అవినీతి అధికారుల భరతం పట్టడం జరిగిందని, బీసీ పొలిటికల్ జేఏసీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు కడుతున్న పన్నులతో వేతనాలు పొందుతూ… అవినీతికి పాల్పడుతున్న అధికారులను వెంటపడి మరీ పట్టుకుంటామని, అదేవిధంగా నిజాయితీ గల అధికారులకు వెన్నంటే ఉంటూ వారికి పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. బీసీ పొలిటికల్ జెఎసి ఫిర్యాదుతో స్పందించి అవినీతి అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ఉన్నతాధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు

