బంజారా సోదర, సోదరీమణులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు: రావుల చంద్రశేఖర్ రెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 20 2026: గిరిజనుల సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తీజ్ పండుగను పురస్కరించుకుని బంజారా సోదర, సోదరీమణులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ బంజారా మహిళలు తొమ్మిది రోజులపాటు గోధుమ విత్తనాలను నారు పెంచి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. అనంతరం గోధుమ నారును పవిత్రంగా నిమజ్జనం చేసి కుటుంబ సభ్యులతో కలిసి తీజ్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం బంజారా సంస్కృతిలో ప్రత్యేకతగా పేర్కొన్నారు. తీజ్ పండుగ బంజారా సమాజంలోని ఆచారాలు, సంప్రదాయాలు, ఐక్యతను ప్రతిబింబిస్తుందని రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ పర్వదినం ప్రతి బంజారా కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శ్రేయస్సు నింపాలని ఆకాంక్షించారు. బంజారా సోదర, సోదరీమణులందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు అని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.

