ePaper
Thursday, August 20, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తికనిమెట్టలో కాళీమాత, పోచమ్మ కట్ట అభివృద్ధి పనులు శరవేగంగా

కనిమెట్టలో కాళీమాత, పోచమ్మ కట్ట అభివృద్ధి పనులు శరవేగంగా

📰 Generate e-Paper Clip

స్థానిక ఎమ్మెల్యే జీఎంఆర్‌ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: కొత్తకోట మండలం కనిమెట్ట స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ప్రత్యేక చొరవతో కనిమెట్ట గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కాళీమాత ఉత్సవాల సందర్భంగా చేపట్టిన అమ్మవారి కట్ట, పోచమ్మ కట్ట అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కాళీమాత, పోచమ్మ అమ్మవార్ల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో దేవాలయాల వద్ద చెరువు కట్టలు, పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులను అధికారులు వేగవంతం చేశారు. పండుగ నాటికి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే జీఎంఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ఆధ్యాత్మిక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీశ్రీశ్రీ కాళీమాత, పోచమ్మ అమ్మవార్ల ఆశీస్సులు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిపై ఎల్లవేళలా ఉండాలని గ్రామ ప్రజలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!