తినేటి విందులో పాల్గొని కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించిన మాజీ ఎమ్మెల్యే…
శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి సహాయం అందిస్తానని హామీ…
పొలిటికల్ పవర్, ఆగస్టు 20:
అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామానికి చెందిన గడ్డం పుల్లారావు–లక్ష్మీకాంతం దంపతుల తనయుడు, జర్నలిస్ట్ గడ్డం సతీష్ స్వగృహానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా సతీష్ కుటుంబ సభ్యులు తాటి వెంకటేశ్వర్లుకు ఆత్మీయ స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన తినేటి విందులో పాల్గొన్న తాటి వెంకటేశ్వర్లు, సతీష్ కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ ఆత్మీయంగా గడిపారు. తాటి వెంకటేశ్వర్లు తమ ఇంటికి రావడం పట్ల సతీష్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో సాగింది.అనంతరం తోగ్గూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న శ్రీ కోదండ రామాలయం కమిటీ సభ్యులు తాటి వెంకటేశ్వర్లును కలిసి ఆలయ నిర్మాణానికి తక్షణ సహాయం అందించాలని కోరారు. దీనిపై తాటి వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందిస్తూ, తమ వంతు సహాయం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జుజ్జురి వెంకన్నబాబు, సున్నం రామలక్ష్మయ్య, పానుగంటి లక్ష్మణ్‌రావు, మాడి ముత్యాలరావు, మడకం ముత్యాలరావు, చెన్నారావు, కొనకళ్ల శ్రీనివాస్, కక్కిరాల లక్ష్మీనారాయణ, జుజ్జురి సాయి, పానుగంటి చెన్నకేశవులు, కుర్సం వీరరాజు, గొల్లపల్లి మహేష్, నాగుల సాయి తదితరులు పాల్గొన్నారు.
