ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

దేశ సమగ్రతకు పటేల్ కృషి ఆదర్శం అఖండ భారత నిర్మాణంలో పటేల్ పాత్ర పటేల్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్

కొత్తగూడెం : దేశ ఐక్యత, సమగ్రత కోసం నిరంతరం పరితపించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ అన్నారు. భారత తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం కొత్తగూడెం నగర పాలక సంస్థ కార్యాలయంలో పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యానంతరం దేశంలో చెల్లాచెదురుగా ఉన్న అనేక సంస్థానాలను ఒక్కటిగా ఏకం చేసి, అఖండ భారతదేశ నిర్మాణానికి పటేల్ చేసిన విశేష కృషి చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. దేశ సమైక్యత పరిరక్షణలో ఆయన ప్రదర్శించిన ధైర్యసాహసాలు, దార్శనికత అద్భుతమైనవని పేర్కొన్నారు. జాతి సమగ్రత కోసం జీవితాంతం పనిచేసిన పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, వాటిని భావితరాలకు అందించేలా ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – పట్టుబడ్డ ఇద్దరు జూదరులు…

  నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్....

Related Articles

భద్రాద్రి కొత్తగూడెం రెవెన్యూ శాఖలో సమయపాలన కరువు! ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు తహసీల్దార్లు? ప్రజలకు అందని ప్రభుత్వ సేవలు.. కింది స్థాయి అధికారుల తీరుతో కలెక్టర్ కార్యాలయ ప్రతిష్ఠకు భంగం...

భద్రాద్రి కొత్తగూడెం: పొలిటికల్ పవర్ ప్రతినిధిభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించి కొందరు అధికారుల పనితీరు, సమయపాలన, విధి నిర్వహణపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం...

పేద ప్రజల గుండె చప్పుడు ‘చల్లా కృష్ణన్న’.. బాధితుడికి తక్షణ ఆర్థిక సాయం! – మంత్రి పొంగులేటి అనుచరుడు తుంబురు దయాకర్ రెడ్డి సూచనతో రంగంలోకి చల్లా – “ప్రజాసేవే కాంగ్రెస్ పార్టీ...

 ఖమ్మం (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - పాలేరు నియోజకవర్గ ప్రతినిధి): ఆపదలో ఉన్న పేదలకు ‘అక్షయ పాత్ర’లా మారుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రజాక్షేత్రంలో సగర్వంగా ముందుకు తీసుకెళ్తున్నారు...

మాదిగ జాతి సంక్షేమమే ధ్యేయం.. కోట నారాయణపురంలో ఎంఎస్‌ఎఫ్ నూతన కమిటీ నియామకం! – పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జోరందుకున్న సంఘటనలు – ఖమ్మం రూరల్ మండలం...

  ఖమ్మం జిల్లా (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - ఖమ్మం జిల్లా ప్రతినిధి ఎన్. శివకుమార్, నవంబర్ 02):మాదిగ జాతి అభివృద్ధి, సంక్షేమం, ఐక్యతే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. పోరాటాల...
error: Content is protected !!