ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్“జగన్ పాలనలో సంపద ఎటు వెళ్లిందన్న ప్రశ్నకు సంక్షేమ పథకాలే సమాధానం”

“జగన్ పాలనలో సంపద ఎటు వెళ్లిందన్న ప్రశ్నకు సంక్షేమ పథకాలే సమాధానం”

📰 Generate e-Paper Clip

చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణుల ప్రతిస్పందన – సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వివరాల వెల్లడి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఎర్ర నాగరాజు రెడ్డి జూన్ 06 2026: అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర సంపద ఎటు వెళ్లిందో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే రాష్ట్ర సంపద ప్రజలకు చేరిందని వారు పేర్కొంటున్నారు.వైసీపీ నాయకుల వివరాల ప్రకారం, కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగించబడ్డాయి. అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, డ్వాక్రా రుణమాఫీ, సున్నావడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, పింఛన్లు, జగనన్న తోడు, జగనన్న చేదోడు వంటి పథకాల ద్వారా లక్షలాది మంది లబ్ధిదారులకు నేరుగా ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్లు, నాన్-డీబీటీ రూపంలో మరో రూ.2 లక్షల కోట్లు ప్రజలకు చేరాయని, మొత్తం రూ.5 లక్షల కోట్లకు పైగా సంక్షేమ ప్రయోజనాలు అందించబడినట్లు పేర్కొన్నారు. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిజిటల్ తరగతి గదులు, విద్యార్థులకు ట్యాబ్‌లు, పౌష్టికాహార పథకాలు అమలు చేశారని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం, అర్బన్ క్లినిక్స్, గ్రామ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఇండస్ట్రియల్ కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాలలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే రాష్ట్ర సంపద ఎటు వెళ్లిందన్న ప్రశ్నకు సమాధానమని వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!