*రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా జిల్లా ఉపసర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్.రంజిత్ కుమార్‌కు ఘన సన్మానం*
జోగులాంబ గద్వాల జిల్లా, సెప్టెంబర్ 18: గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి *రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.*
*ఈ సందర్భంగా జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్. రంజిత్ కుమార్ ను బక్కి వెంకటయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు.*
అనంతరం *రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ*…అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. సమాజంలోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడాలని, తన వంతు సహకారం పూర్తిస్థాయిలో అందిస్తానని తెలిపారు. భవిష్యత్తులో రాజ్యాధికారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ రంజిత్ కుమార్‌కు ఆశీస్సులు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
*ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిజ్వారం ఎస్. తిరుమలేష్ పాల్గొన్నారు.*


*రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా జిల్లా ఉపసర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్.రంజిత్ కుమార్‌కు ఘన సన్మానం*