ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి

జ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి

📰 Generate e-Paper Clip

– ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నఎక్స్‌రే, ల్యాబ్, ఇతర సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్. 12. 2026.జ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని,జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిఅన్నారు.శుక్రవారంజిల్లాకలెక్టర్,ఖిల్లాఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ముందుగా ఆసుపత్రిలోని ల్యాబ్, ఎక్స్‌రే గదిని కలెక్టర్ పరిశీలించారు. ప్రయోగశాలలో అందుబాటులోఉన్నపరీక్షలు,రోజువారీగానిర్వహిస్తున్నపరీక్షలవివరాలనువైద్యులనుఅడిగితెలుసుకున్నారు. ఆసుపత్రికి అందుబాటులోఉన్నఎక్స్‌రే,యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగించి ప్రజలకు మెరుగైనవైద్య సేవలుఅందించాలనిసూచించారు.ఈసందర్భంగాకలెక్టర్ మాట్లాడుతూ జ్వరంతో ఆసుపత్రికివచ్చేరోగులపై ప్రత్యేక దృష్టి సారించాలనితెలిపారు.జ్వరలక్షణాలతో వచ్చే రోగులకుడెంగ్యూపరీక్షలునిర్వహించేలాచర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. సకాలంలో వ్యాధిని గుర్తించి, అవసరమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే క్షయ వ్యాధిఅనుమానంఉన్నరోగులనుగుర్తించి,అవసరమైన వారికి ఎక్స్‌రే పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్,సూచించారు.ఆసుపత్రులకుప్రభుత్వంఅందించినఎక్స్‌రేయంత్రాలనునిరుపయోగంగాఉంచకుండా, అవసరమైన రోగులకు పరీక్షలు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, సంబంధిత వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందులపై కలెక్టర్ వైద్యులను, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులుఎల్లప్పుడూఅందుబాటులోఉండేలాచర్యలుతీసుకోవాలని,మందులనిల్వలనుఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలనిసూచించారు.ఆసుపత్రిలోప్రసవాలనిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా కలెక్టర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు అవసరమైన వైద్య సేవలు,ప్రసవసమయంలోఅందించాల్సినసౌకర్యాలను సమర్థవంతంగా కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లోతక్షణవైద్యసేవలుఅందించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనితెలిపారు.ఆసుపత్రి పరిసరాలు, వార్డులు, ఇతర ప్రాంతాల్లో పరిశుభ్రతను ఎల్లప్పుడూకాపాడాలనికలెక్టర్,ఆదేశించారు.రోగులకు, వారి సహాయకులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.

ఎస్సీ బాలుర హాస్టల్ నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
శుక్రవారం జిల్లా కలెక్టర్ ఖిల్లాఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహ భవనం శిథిలావస్థకు చేరిన ప్రస్తుత పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధితఅధికారులకుపలుసూచనలుచేశారు.శిథిలావస్థకు చేరిన వసతి గృహ భవనానికి సంబంధించి పూర్తి వివరాలతో ఫైల్‌ను సిద్ధం చేసి సమర్పించాలని ఎస్సీ సంక్షేమ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుత భవనం పరిస్థితి, నూతన భవనం నిర్మాణం ఆవశ్యకతతదితరఅంశాలనుపొందుపరుస్తూప్రభుత్వానికిప్రతిపాదనలుపంపేందుకుచర్యలుతీసుకోవాలనిసూచించారు.విద్యార్థులవసతికిఎలాంటిఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయఏర్పాట్లుచేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు తాత్కాలికంగా వసతి కల్పించేందుకు అనువైన భవనాన్ని గుర్తించి, అవసరమైనసౌకర్యాలతోఅందుబాటులోకితీసుకురావాలని అధికారులను ఆదేశించారు.శిథిలావస్థలో ఉన్న భవనంలోవిద్యార్థులకుఇబ్బందులుకలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. తాత్కాలిక భవనం గుర్తింపు, నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం వంటి చర్యలను సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకుసూచించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిభాస్కర్ నాయక్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాంజీరావు, తహసిల్దార్, ఎంపీడీవో, సంబంధిత వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!