గద్వాల డిపోలో నిబద్ధతతో సేవలందించిన తమ్ముడికి ఆత్మీయుల అభినందనలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 31 2026: గద్వాల ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వి.టి. గౌడ్‌కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, మాజీ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానం చేసి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వి.టి. గౌడ్ అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఉద్యోగ జీవితంలో నిబద్ధతతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందడం అభినందనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటన్న గౌడ్, ఏబీజే సత్యం సాగర్ (మాజీ ఎంపీటీసీ), కాటముని శ్రీధర్ గౌడ్, మరాఠీ మన్యం నాయుడు, గువ్వల గోపి, వడ్ల దామోదర్ చారి, రవికుమార్ నాయుడు తదితరులు పాల్గొని వి.టి. గౌడ్‌ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆత్మీయంగా సాగింది. పదవీ విరమణ సందర్భంగా తనను సన్మానించిన ప్రతి ఒక్కరికీ వి.టి. గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

