పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 28 2026: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే. తారక రామారావు (కేటీఆర్) ఢిల్లీ చేరుకున్నారు. రేపు కేంద్ర రైల్వే, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ రంగ అభివృద్ధి, డిజిటల్ మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ, కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేటీఆర్ వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరుతూ సమగ్రంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల వేగవంతమైన అమలు, కొత్త రైల్వే మార్గాల అభివృద్ధి, ఐటీ పరిశ్రమ విస్తరణకు అవసరమైన చర్యలు, ఉపాధి అవకాశాల పెంపు వంటి అంశాలను కూడా సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్ ఎంపీ, తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజ్ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు, తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.
