పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి రాష్ట్రం మొత్తంలో రెవిన్యూ పరిపాలన విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సపరేటు రాష్ట్రంలో అనుసరించే పరిపాలనకు సంబంధించిన విషయంలో లేదా విడుదల అవుతున్న జీవోలలో అనుసరించే విధానంలో అసలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగమేనా…? అనే అనుమానం సామాన్య ప్రజానీకానికి మేధావులకు తెలిసి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తుంది ఉదాహరణకు హైకోర్టు నుంచి కానీ లేదా జిల్లా కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ ని అమలు పరచడంలో కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వే ఆధారిత ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చివరి స్థానంలో నిలిచింది ఎందుకు…? ప్రధానమైన కారణం జిల్లాలోని పరిపాలన విభాగం కలెక్టర్ మరియు కలెక్టర్ ఆఫీసు సిబ్బంది ఎందుకనగా కలెక్టర్ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఉత్తర్వులు జీవో ప్రకారం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అమలు చేస్తుంది ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి మాత్రమే లేట్ అవుతుంది ఇదే విషయంలో ఎన్నో కథనాలు ఎన్నో శీర్షికలు మీడియాలో ప్రచురించిన కూడా ఎటువంటి జీవో అమలుకు చర్యలు లేవు. దీనికి ఉదాహరణకి కలెక్టర్ సొంత పేసి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి ఉన్న గన్మెన్లు మరియు బంట్రోతులు పేసీలో ఉన్న సిబ్బంది వారికి స్థానచలనం లేదు సొంత పేసికే దిక్కులేని స్థితిలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు రెవిన్యూ ఇతర విభాగాలకు సంబంధించిన వారి పరిస్థితి అగోమ్యచరం…!! సొంత పేసిలోనే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి స్థానాచలనం లేనిది జిల్లాలోని ఇతర విభాగాలలో మరియు ముఖ్యంగా రెవిన్యూ 10 సంవత్సరాలు పైబడిన వారిని ఒకే సీటులో కొనసాగిస్తూ రాష్ట్రంలో మరియు దేశంలోనే మొదటిసారిగా భద్రాద్రి జిల్లా వార్తల్లో నిలుస్తున్నది జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా కొత్తగూడెం ప్రాతినిధ్యం వహిస్తున్న కూనం నేని సాంబశివరావు సిపిఐ పార్టీ ఉండటం వలన అధికార పార్టీ నాయకులు దరిదాపుల్లో కూడా రావడం లేదు అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి ప్రస్తుత భద్రాద్రి జిల్లాలో నెలకొన్న అనిచ్చితి మరియు పరిపాలన విభాగంలో జరుగుతున్న అవకతవకలు మరియు ముఖ్యంగా రెవిన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ప్రజలు పడుతున్న ఇబ్బంది శోచనీయం.. ఇతర విభాగాల పరిస్థితి దేవుడెరుగు గానీ రెవెన్యూ సంబంధించిన విభాగం లో జరుగుతున్న అక్రమాలపై అవినీతిపై రెవెన్యూ మరియు గవర్నమెంట్ కోర్ట్ వారి అవినీతి అక్రమాలపై సొంత శాఖకు మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే స్పందించి సొంత శాఖపై సమీక్ష నిర్వహించి శాఖను బస్టు పట్టిస్తున్న అధికారులపై తగు చర్యలు తీసుకోకపోతే జరిగే పరిణామాలు ముందు ముందు తీవ్రతరం కానున్నాయి ఇట్టి విషయమై గౌరవ కలెక్టరేట్ ని ఎన్నిసార్లు కలిసిన చర్యలు మాత్రం శూన్యం ఇదే పందాకొనసాగితే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవడం ఎంతో దూరంలో లేదు ఇదే పరిస్థితికి ఆసరా చేసుకొని టిఆర్ఎస్ పార్టీ వారు కొత్తగూడెం సీటుని దక్కించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు

