-పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 09 2026: హైదరాబాద్‌లో బండ్లగూడ జాగీర్‌లో కళ్లికా మత దేవాలయం లో శనివారం రోజు జరిగిన బోనాల పండుగ సంబరాలలో వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బోనాల పండుగ అన్ని పలుస శంకర్ గౌడ్ అన్నారు. అమ్మ మహంకాళి ఆశీస్సులు తెలంగాణ ప్రజల అందరిపై ఉండాలని, బోనం సమర్పించే ప్రతి ఆడపడుచుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు. పసుపు, కుంకుమ, చీర, గాజులతో అలంకరించిన బోనం మన సంప్రదాయానికి గర్వకారణం అన్నారు.
పొంగళి వాసన, డప్పుల చప్పుడు, పోతురాజుల నృత్యం – అన్నీ కలిస్తేనే బోనాలు.
గోల్కొండ నుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి వరకు భక్తి పారవశ్యం. అమ్మ దయతో మన రాష్ట్రంలో వర్షాలు కురిసి, పంటలు పండాలి. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలి. కుల, మతాలకు అతీతంగా అందరం కలిసి పండుగ జరుపుకోవాలన్నారు.
తెలంగాణ ఆడబిడ్డల త్యాగానికి, భక్తికి ప్రతీక బోనాలు.
రంగం చెప్పేటప్పుడు వచ్చే భవిష్యత్తు వాక్కులు మనకు మార్గదర్శనం. శివసత్తుల నృత్యం, బోనాల ఊరేగింపు మన గుండెల్లో ఉత్సాహం నింపుతాయి. అమ్మకు సమర్పించే బోనం మన కృతజ్ఞతకు నిదర్శనం అన్నారు. ఈ పండుగ మన సంస్కృతిని, ఐక్యతను ప్రపంచానికి చాటుతుంది. పేద, ధనిక తేడా లేకుండా అందరం అమ్మ పాదాల వద్ద ఒక్కటవుతాం. బోనాల సందడిలో మన బంధాలు మరింత బలపడాలి అన్నీ పలుస శంకర్ గౌడ్ ఆకాంక్షించారు. అమ్మ మహంకాళి మన కుటుంబాలను కష్టాల నుండి కాపాడదుతుండన్నారు. యువత మన సంప్రదాయాలను గర్వంగా ముందుకు తీసుకెళ్లాలి అన్నారు.


