ePaper
Sunday, August 9, 2026
📄 ePaper
Homeతెలంగాణఎరుకల నాయకుడి అవమానాన్ని సహించం

ఎరుకల నాయకుడి అవమానాన్ని సహించం

📰 Generate e-Paper Clip

బుడ్డా సత్యనారాయణను కించపరిచిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

కాంగ్రెస్‌ అధిష్టానం చర్యలు తీసుకోవాలని టిఆర్పి దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి మంగరాయి వెంకటేష్, డిమాండ్ 

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 09 2026: మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్చార్జి మంగరాయి వెంకటేష్ శనివారం మాట్లాడుతూ… ఎరుకల జాతి నాయకుడు, ఎల్‌బీనగర్‌ మన్సూరాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌, బుడ్డా సత్యనారాయణను, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జక్కిడి ప్రభాకర్‌ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎరుకల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించినదిగా పేర్కొంటున్న ఆడియో వెలుగులోకి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వివిధ సంఘాల నాయకులు కుల దూషణలకు పాల్పడితే సహించేది లేదు ఎరుకల జాతికి చెందిన నాయకుడిని, ఆయన కుటుంబ సభ్యులను కులపరంగా అవమానించే విధంగా మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై సమగ్ర విచారణ జరిపి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అలాగే సంబంధిత వ్యక్తిపై కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని కోరారు. కుల అహంకారాన్ని ప్రదర్శించే చర్యలనూ ప్రజాస్వామ్య సమాజం సహించదని హెచ్చరించారు.

“ఏకలవ్యుడి నుంచి సత్యనారాయణ వరకు ఇదే వివక్ష”

ఏకలవ్యుడి కాలం నుంచి నేటి వరకు ఎరుకల జాతి ప్రజలు సామాజిక, రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆధిపత్య ధోరణులను ప్రశ్నిస్తూ ఎరుకల సమాజం తన హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడిన ఎరుకల సమాజానికి రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, చట్టసభల్లో అవకాశాలు, నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను డిమాండ్‌ చేశారు. కేసును నీరుగార్చితే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేస్తామని తెలుపుతూ ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!