ePaper
Friday, October 30, 2026
📄 ePaper

దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

📰 Generate e-Paper Clip


నంద్యాల జిల్లా శ్రీశైలం అక్టోబర్ 29 (పొలిటికల్ పవర్ న్యూస్ )
లోకకల్యాణంకోసం దేవస్థానం ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.
ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది.
ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి.
లోకోద్ధరణకోసమై బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.
కాగా శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.
ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు.
కాగా దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరితీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది.
కాగా శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు.
శ్రీపాదవల్లభుల జన్మ తరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామివారు జన్మించారు.వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైలమల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది.
నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు. కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువకావడముతో, నృసింహసరస్వతీస్వామి అదృశ్య రూపములో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతికదేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు.
శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతిస్వామివారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని, కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటిఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది.

Latest Articles

సిపిఎం అభ్యర్థి గండి సునీల్ కుమార్ ఇంటింటి ప్రచారం

బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగుఏం, వెంకటేశ్వర్లు,కడప (జిల్లా) :- బ్రహ్మంగారి మఠం...

శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ ఘటన పై కేసు నమోదు

అన్ని కోణాల్లో దర్యాప్తు - సీఐ జలంధర్ రెడ్డిమేడిపల్లి: 29 అక్టోబర్...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం

ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి సన్మానం.. నూతన వధూవరులకు ఆశీర్వాదంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట,...

వెలుగుమట్ల కాలనీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు నవంబర్ నెలాఖరు లోగా పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల

వెలుగుమట్ల కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన మంత్రిపొలిటికల్ పవర్...

నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి.. మంత్రి తుమ్మల

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి భవన నిర్మాణ...

Related Articles

శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ ఘటన పై కేసు నమోదు

అన్ని కోణాల్లో దర్యాప్తు - సీఐ జలంధర్ రెడ్డిమేడిపల్లి: 29 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ,బోడుప్పల్ శ్రీ చైతన్య కళాశాల హాస్టల్ లో జరిగిన విద్యార్థుల దాడి ఘటనలో కేసు...

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం

ఎస్సై సాయి కిషోర్ రెడ్డికి సన్మానం.. నూతన వధూవరులకు ఆశీర్వాదంపొలిటికల్ పవర్,అశ్వారావుపేట, అక్టోబర్ 29: బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం గురువారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అశ్వారావుపేట...

error: Content is protected !!