మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.
మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.
ఘట్కేశ్వర్ : సిద్ధాంత నిబద్ధత, క్రమశిక్షణ, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అద్వానీ గారి రాజకీయ ప్రస్థానం.
పండుగ ఆనందాలను సమాజంలోని ప్రతి ఒక్కరితో పంచుకోవడమే భారతీయ సంస్కృతి గొప్పతనం. మాతృ అభయ అనాథ ఆశ్రమంలో చిన్నారులకు పండ్ల పంపిణీ పంపిణీ చేసి ఘనంగా దీపావళి వేడుకలు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి డివిజన్‌లో ఉన్న మాతృ అభయ అనాథ ఆశ్రమంలో మాజీ ఉప ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత, పద్మవిభూషణ్ లాల్ కృష్ణ అద్వానీ జన్మదినోత్సవం మరియు దీపావళి పండుగను పురస్కరించుకొని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులకు పండ్లు పంపిణీ చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చిన్నారులతో కలిసి టపాసులు కాల్చి దీపావళి సంబరాల్లో పాల్గొని వారిలో ఆనందోత్సాహాలను నింపారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నత నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ. భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి, అంకితభావం, క్రమశిక్షణ, సిద్ధాంత నిబద్ధత ప్రతి కార్యకర్తకు ఆదర్శప్రాయమని అన్నారు. పార్టీ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్ర, దేశ రాజకీయాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అధికారమే పరమావధిగా కాకుండా దేశ సేవ, పార్టీ సిద్ధాంతాలే లక్ష్యంగా పనిచేసిన అద్వానీ రాజకీయ ప్రస్థానం నేటి యువతకు, ప్రతి బీజేపీ కార్యకర్తకు స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. దీపావళి పండుగ అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే పండుగ అని, సమాజంలోని నిరుపేదలు, అనాథ చిన్నారులతో పండుగ ఆనందాలను పంచుకోవడమే నిజమైన పండుగ స్ఫూర్తి అని అన్నారు. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం ఎంతో సంతోషంగా ఉందని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
సేవా భావం, సంస్కృతి, సంప్రదాయం, సమాజం పట్ల బాధ్యతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అసలైన బలం. సమాజంలోని ప్రతి ఒక్కరి సంతోషంలో భాగస్వాములవుతూ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు బండారు పవన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పల్లె బాలరాజ్ గౌడ్, మేడిపల్లి డివిజన్ అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పుష్పలత గౌడ్, డివిజన్ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

