
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :
గార్ల మండలం మున్నేరు రైతు రక్షణ కమిటీ కార్యవర్గ సమావేశం శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గార్ల మండల కేంద్రంలోని విశ్వ న్యాయవాద కార్యాలయంలో కో కన్వీనర్ సోమ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో మున్నేరు రైతు రక్షణ కమిటీ కన్వీనర్ మూడు హరినాయక్ మాట్లాడుతూ పేద గిరిజన రైతుల పుట్టగొట్టే మున్నేరు పాలేరు లింక్ కెనాల్ జీవో 98 ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నేరు పరివాహక ప్రాంతానికి ఏ ప్రయోజనం లేని మున్నేరు పాలేరు లింక్ కెనాల్ రద్దు చేయడం కోసం రైతు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని అన్నారు. ప్రభుత్వం మున్నేరు పాలేరు లింకు కెనాల్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణను చర్చించి నిర్ణయించుకొనుటకు నవంబర్ 7న సాయంత్రం నాలుగు గంటలకు గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో మున్నేరు రైతు రక్షణ కమిటీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మూడు హరినాయక్ తెలిపారు. ఈ సమావేశానికి రైతులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో మున్నేరు రైతు రక్షణ కమిటీ గౌరవనీయ సలహాదారు విశ్వ జంపాల, కో కన్వీనర్లు బానోత్ రమేష్ బాలాత్ చంటి బుక్కే హనుమంతు బాదావత్ రమేష్ భూక్య చిన్న, మూడు వాల్యా మూడు రాము భుూక్యా రాజు, బాదావత్ సేవియా, గిన్నారపు మురళి తారక రమారావు, మూడు భాస్కర్ మూడు సురేష్ మూడు అశోక్, భూక్య శ్యాం, ముంగి రాములు తదితరులు పాల్గొన్నారు.
మూడు హరినాయక్
కన్వీనర్
మున్నేరు రైతు రక్షణ కమిటీ – గార్ల

