
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :
మహబూబాబాద్ జిల్లా గార్ల -బయ్యారం మండలాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిచకపోవడంతో దళారులకు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకొని నష్టపోతున్న రైతులు..
గార్ల -బయ్యారం మండలాల్లో కొన్ని గ్రామంలో కొంతమంది రైతులు వరి కోసి మరి కొన్ని చోట వరి కోతకు వచ్చి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నామని రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నామాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేనినో ప్రాబ్లంతో వర్షపాతం లేక, చాలీ చాలని నీళ్లతో వరి పంటకు రాత్రి పగలు తేడా లేకుండా కస్టపడి, లోవోల్టేజ్ కరెంట్ తో అనేకసార్లు మోటార్లు కాలిపోయిన, మోటార్ల అల్లిచి పెట్టి కంటికి కునుకు లేకుండా ఆరు కాలాలు కస్టపడి పండించిన పంటకు దళారులు చెప్పిందే వేదంగా ఉందని, దళారులు చెప్పిన రేటు క్వింటాకు 2300-2400 రూపాయలకే కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు
. ప్రభుత్వం కొనుగోలు చేసే క్వింటాకు 2320రూపాయలు +500రూపాయలు బోనస్=2820 వచ్చేవని దళారుల చేతులలో నష్టపోతున్నామని రైతులు ఇబ్బందులకుగురైతున్నారు.
పంటకు తెచ్చిన అప్పు తీర్చే పరిస్థితి లేదని, అప్పులో కురకో పోతున్నామని వాపోయారుపండించిన పంటను అరబోసేందుకు కూలీలకు, పట్టాల కిరాయికు సరిపోవని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

