
* జూలూరుపాడు నవంబర్ 06: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో.అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర వసతి సందర్శించారు. ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ* మాట్లాడుతూ అనంతరం విద్యార్థులతో మాట్లాడే పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమన్నీ పక్కదారి పట్టిస్తు ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాస్మోటిక్ మెస్ ఛార్జ్, పెంచాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ శతృహ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా విద్యార్థుల సమస్యలు గాలికి వదిలేశారని వారు ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా అద్దే భవనాల నడుస్తున్న వశీకృహాలకు తక్షణమే సొంత భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విద్యా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని.ఈ సందర్భంగా వంశీ డిమాండ్ చేశారు.తక్షణమే సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం హాస్టల్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా సాగర్ ,సంపత్ ను ఎన్నుకున్నారు. వారితోపాటు 10 మంది హాస్టల్ కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు అనిల్ కుమార్ బాలాజీ మండల నాయకులు అనిల్ అఖిల్ విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.

