ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు
దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని లంకసాగర్ క్రాస్‌రోడ్ వద్ద గతంలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి హయాంలో ఎంపీ నిధులతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణకు గురై దశాబ్దాలుగా నిరుపయోగంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ గాయం రమేష్, కమ్యూనిటీ హాల్‌ను తిరిగి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశ్యంతో చర్యలు ప్రారంభించారు. గ్రామ సెక్రటరీ టి. నాగేంద్ర బాబుతో కలిసి పంచాయతీ సిబ్బంది సహకారంతో కమ్యూనిటీ హాల్ పరిసరాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాయం రమేష్ మాట్లాడుతూ… ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. త్వరలోనే హాల్‌కు రంగులు వేయించి, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



