పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులకు కనీస రక్షణ పరికరాలు అందకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో సుమారు 83 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కార్మికులకు అత్యంత అవసరమైన చేతి గ్లౌజులు, మాస్కులు, కాళ్లకు బూట్లు, టోపీలతో పాటుగా నిత్యం వాడే శానిటైజర్, సబ్బులు, నూనెలను అధికారులు సరఫరా చేయాలని.స్థానిక కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.నిధుల కొరత వల్ల పరికరాలు అందించడం లేదా? లేక సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? అనేది అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ సామగ్రి లేకపోవడంతో వేరే దారి లేక కొందరు కార్మికులు షాపుల్లో దొరికే ప్లాస్టిక్ కవర్లను చేతులకు కట్టుకుని చెత్తను ఎత్తాల్సిన దుస్థితి దాపురించింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా, శానిటైజర్లు మరియు సబ్బులు కూడా ఇవ్వకుండా కార్మికులతో చెత్తను సేకరించడం వల్ల వారు తీవ్ర అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కార్మికులు జబ్బుపడితే వారికి కనీస ఆసరాగా నిలిచి, వైద్య ఖర్చులు భరించే పరిస్థితి కూడా ఇక్కడ లేదని నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కార్మికులకు తక్షణమే రక్షణ పరికరాలతో పాటు అవసరమైన సబ్బులు, నూనెలు, శానిటైజర్లను అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు, కరవైన కనీస రక్షణ పరికరాలు
RELATED ARTICLES
