ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలోని...

ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలోని ఏజెన్సీ కాంట్రాక్టర్లు : ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగల జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నందు మండలాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 18,000 మంది బెడ్ సైడ్ కార్మికుల శ్రమ దోపిడికి పాలు పడుతున్న ఏజెన్సీ కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దల ముసుగులో ఏడాది కాలంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్సెట్ కార్మికుల కాంటాక్ట్ అయిపోయిన ఇంకా నూతన ప్రక్రియ ప్రారంభం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోటి 18 వేల మంది బెడ్ సైడ్ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ వారి జీవన స్థితిగతులను నాశనం చేస్తున్నారు అని మండిపడిన ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య హైదరాబాదు SPS కార్యాలయం నందు మీడియా మిత్రులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం బెడ్ సైడు కార్మికుల పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో తెలియటం లేదు అని ఆవేదన వ్యక్తపరిచినారు గత 20 సంవత్సరము నుండి ప్రభుత్వ ఆస్పటల్ నందు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ గా సర్వీస్ చేస్తున్న మా పట్ల కనికరం లేని విధముగా రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆరోగ్య విభాగం సంబంధించిన ఉన్నత అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి నిర్లక్షణ దొరనకు చెమర గీతం పాడే టైం దగ్గర పడింది అని ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తీవ్రంగా హెచ్చరించినది. ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రి నందు పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికులను 18,000 మందిని ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ లో విలీనం చేసి నెలకు కనీస వేతనం 26000/- ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి అని తెలియపరిచినారు. ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ ద్వారానే మా బెడ్ సైడ్ కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది అని తెలియపరిచినారు. ఇప్పటివరకు ప్రభుత్వ అండదండలతో ఏజెన్సీ కాంట్రాక్టర్లు మా బెడ్ సైడు కార్మికుల జీతాలలో ఈపీఎఫ్ & ఈఎస్ఐ లో చాలా అవకతవకలు చేసి లబ్ధి పొందినారు అని అన్నారు. యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి టైంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మా సానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ సేవలు చేస్తూ ఎంతోమంది మా కార్మికులు కూడా ఆ మహమ్మారి కరోనా వలన చనిపోయినారు అని ఆవేదన వ్యక్తపరిచినారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎటువంటి లబ్ధి చేకూరలేదని మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు విధులకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్లే సమయంలో అనేక ప్రమాదాలకు గురి అయ్యి మా కార్మికులు అంగవైకల్యముగా ఉన్నారు అని అటువంటి వారికి కూడా ఎటువంటి ప్రమాద బీమా వర్తించలేదని తెలియపరిచినారు. ఇట్టి విషయాన్ని ఎస్ పి ఎస్ మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఎట్టి పరిస్థితుల్లో సహించదు అని హెచ్చరిక జారీ చేసినారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా బెడ్ సైడ్ కార్మికులను ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ లో విలీనం చేయాలని తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఎస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ ఎస్ పి ఎస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ప్రభుత్వం తక్షణమే సరియైన నిర్ణయం తీసుకొని మా కార్మికులు న్యాయం చేయాలి అని లేనియెడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాల హాస్పిటల్ నందు సేవలు నిలిపివేసి రాష్ట్రవ్యాప్త మహా ధర్నాకు పిలుపును ఇవ్వాల్సి వస్తది అని తెలియపరిచినారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!