ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచి భవిష్యత్తు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచి భవిష్యత్తు

📰 Generate e-Paper Clip

–  పొగాకు బసమ్మ,జంబులింగం పేరట బాలుర ప్రాథమికోన్నత పాఠశాలలో స్టేజి నిర్మాణం కోసం నాలుగు లక్షల వితరణ,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18. 2026.

ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులు చదువుతుంటారని.రాబోయే కాలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ గారు అన్నారు.గురువారం కొత్తకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తన తల్లి పొగాకు బసమ్మ 5వ వర్ధంతి వేడుకలను విద్యార్థుల సమక్షంలో జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి పొగాకు విశ్వేశ్వర్ గారు మాట్లాడుతూ..పొగాకు బసమ్మ తన తల్లి ఐదవ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో స్టేజి నిర్మాణం కోసం తనతోపాటు..తమ కుటుంబ సభ్యులు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకొచ్చారని..వీలైనంత తొందరలో ఆ పనులు పూర్తి చేసి తమ తల్లిదండ్రులైన కీర్తిశేషులు పొగాకు బసమ్మ,పొగాకు జంబులింగం గారి పేరట ఆ స్టేజిని పాఠశాలకు అప్పచెబుతామని అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో అర్హులైన ట్రైనింగ్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు ఉంటారని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పొగాకు సుఖేషిణి విశ్వేశ్వర్ గారు మాజీ జెడ్పిటిసి సభ్యులు డాక్టర్ పీజే బాబు గారు , పొగాకు రజనీకాంత్,పొగాకు వీరేంద్రతో పాటు..బాలుర, బాలికల ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయ బృందం బి ఆర్ ఎస్ నాయకులు లక్ష్మన్న గారి రవీందర్ రెడ్డి,నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!